జాతుల్ సెప్పుట!

జాతుల్ సెప్పుట!

.

"జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి

ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి

ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ

శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!

.

శ్రీ కాళహస్తీశ్వరా!

భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను 

.

పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు 

.

పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, 

.

అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను 

.

సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది 

.

ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి 

.

అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను 

.

ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!