నలుని హరి పూజ :

నలుని హరి పూజ :

.

(శ్రీ పిస్కా సత్యనారయణ గారి వివరణ)


క్రిందటిపద్యములో హరుని ఆరాధించిన నలచక్రవర్తి, ఈనాటి పద్యములో శ్రీహరిని అర్చిస్తున్నాడు.


నరనాథ సమర్పితమగు

విరవాదుల దండ యొప్పె వెన్నుని పాదాం

బురుహంబున, నంగుటమున

నురలిన యాకాశగంగ కుపమానంబై!


(శృంగారనైషధము - శ్రీనాథుడు)


అర్థములు: నరనాథుడు = రాజు (నలుడు); సమర్పితమగు = అర్పించిన; విరవాదుల దండ = విరజాజిపూలమాల; ఒప్పె = ప్రకాశించెను; వెన్నుడు = విష్ణువు; పాదాంబురుహంబున = పాదపద్మమున; అంగుటమున = అంగుష్ఠమున (కాలి బొటనవ్రేలున); ఉరలిన = ప్రవహించిన; ఉపమానంబై = పోలికయై.


భావము: విష్ణుపూజకు ఉపక్రమించిన నలరాజు, ఎంతో భక్తితో విరజాజులతో కూర్చబడిన పుష్పమాలను శ్రీహరి పాదపద్మములకు సమర్పించినాడు. అప్పుడు అది, ఆయన అంగుష్ఠమున ఉద్భవించి ప్రవహించిన పవిత్రమైన ఆకాశగంగ వోలె భాసించినది...... గంగాభవాని విష్ణుపాదోద్భవి కదా!

(Painting Of Vishnu.....by SriMahadev Visvanath Dhurandhar)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!