సామాన్యునికి నచ్చని వేమన పద్యాలు!

సామాన్యునికి నచ్చని వేమన పద్యాలు!

.

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం “వెన్నదొంగ”లోనూ కనిపిస్తింది.

పాలకడలిపైన పవ్వళించినవాడు

గొల్ల ఇండ్ల పాలు కోరనేల?

ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి

విశ్వదాభిరామ వినురవేమ

.

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?

కనక మృగము భువిని కద్దులేదనకుండ

తరుణి విడిచిపోయె దాశరధియు

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?

విశ్వదాభిరామ వినురవేమ.

.

విగ్రహారాధనను విమర్శిస్తూ

పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి

చెలగి శిలల సేవ జేయనేల?

శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?

విశ్వదాభిరామ వినురవేమ.

.

కులవిచక్షణలోని డొల్లతనం గురించి

మాలవానినంటి మరినీట మునిగితే

కాటికేగునపుడు కాల్చు మాల

అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?

విశ్వదాభిరామ వినురవేమ.

.

వేమన పద్యాలు మరికొన్ని

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?

భాండశుద్ధి లేని పాకమేల?

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ వినురవేమ.

.

అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.

.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిముల్లు

ఇంటిలోని పోరు ఇంతింతగాదయా

విశ్వరాభిరామ వినురవేమ.

.

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?

చాటు పద్యములందు చాలదా యొక్కటి

విశ్వదాభిరామ వినురవేమ

.

ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపే కాని తెలుపు రాదు

కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా

విశ్వదాభిరామ వినురవేమ

.

పిండంబులను చేసి పితరుల తలపోసి

కాకులకు పెట్టు గాడ్దెలార!

పియ్యి తినెడు కాకి పితరుడేట్లయరా?

విశ్వదాభిరామ వినురవేమ

.

పుత్తడి గలవాని పుష్ట్రంబు పుండైన

వసుధలోన చాల వార్త కెక్కు

పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు

విశ్వదాభిరామ వినురవేమ

.

వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం

వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు.

కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు

ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద 

వేమన కలం ఝళిపించాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!