జవ్వనుల చిత్తాలు!

జవ్వనుల చిత్తాలు!
.
“ఏవడే ఆ చుంచు మొహం గాడు ?
మీసాలు, గెడ్డాలు కూడా లేకుండా కోతిలా వున్నాడు.
వాడి వెధవ ముఖానికి సైటు కొట్టడం ఒకటి. చూడు మనల్నే ఎలా చూస్తున్నాడో ? “ ఈసడింపుగా అంది రేఖ.
“ ఓహ్, అతనా ! అతను నాకు అన్నయ్య వరస అవుతాడులే.
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం.శెలవల కోసం నిన్నే ఈ ఊరొచ్చాడు” అసలు సంగతి చెప్పింది రాధ.
.
“ ఓహ్ గ్రేట్, ఎంత అందమైన పెర్సనాలిటీనో, షారూఖ్ ఖాన్ కూడా ఇతని ముందు దిగదుడుపే, కంప్లీట్ షేవింగ్ లో ఇంకా సూపెర్బ్ గా వున్నాడు
.కాస్త పరిచయం చెయ్యవే బాబూ , నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమిలాడసాగింది రేఖ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!