ఒక జోల పాట!

ఒక జోల పాట!

జో జో కమళ దళేక్షణ ! జో జో మృగరాజమధ్య ! జో జో కృష్ణా !

జో జో పల్లవకరపద ! జోజోపూర్ణేందువదన ! జో జో యనుచున్

” ఏనాడు నోచిన నోముల ఫలమో , ప్రొద్దున్నే శుభవార్త వినిపించింది . మన యశోద ఒక చిన్ని మగవాణ్ణి కన్నదట . చూచి వద్దాము . ” అని నంద గోకులం లోని సుదతులందరూ నందగోపుని ఇంటికి ప్రయాణమయ్యారు . తొందరగా చిన్ని పాపను చూడాలని అనుకుంటూ వడి వడిగా అడుగులు వేయడానికి ప్రయత్నిచారు . కానీ విశాలమైన పిరుదులు , పిడికెడు నడుములు వారి వేగాన్ని సాగనీయ లేదు . నెమ్మదిగా నడక సాగింది . నడుస్తున్న వారి తలకొప్పులు తుమ్మెద రెక్కల వలె ఊగుతున్నాయి . కన్నులు విచ్చుకొని ఆనందాన్ని సూచిస్తున్నాయి . సరే ! ఉత్సాహంగా బయలు దేరిన వారి జన్మ ధన్యమయింది . పడిన కష్టానికి వేయింతలు , లక్షింతలు ఫలం లభించింది . విష్ణువును కాదు కాదు చిన్ని కృష్ణుని కనులారా చూడగలిగారు . కృష్ణునికి తాము తెచ్చిన కానుకలు సమర్పించుకున్నారు .

కృష్ణుని ఇంకా ఇంకా చూడాలనే కోరిక కలుగ్తోంది . అంతే ! ఆ బాలుణ్ణి తమ చేతుల్లోకి తీసుకున్నారు . శరీరానికి నూనె అంటారు . పసుపు పూసారు . స్నానం చేయించారు . ” శ్రీరామ రక్ష ” అని అంతూ కొన్ని నీళ్ళు శరీరం చుట్టూ తిప్పి చల్లారు . తొట్టెలో పడుకోబెట్టారు . జోల పాటలు పాడారు .

అందులో ఒక జోల పాట పై పద్యం .

గోపికల ఉత్సాహాన్ని , వారు చేసిన పనులనూ , మన కంటి ముందు తెచ్చిపెట్టాడు పోతన్న . ఈ పద్యం ఒక దృశ్యకావ్యం . మన కనుల ముందు జరిగినట్టే అనిపించేలా సాగింది వర్ణన . దానితో బాటుగా పిల్లవాడు పుట్టినపుడు పూర్వకాలంలో ఉవిదలు చేసే కార్యక్రమాలన్నీ మనకు తెలియజెప్పాడు .


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!