Skip to main content
శ్మశాన వాటిక – అనే కవితా ఖండిక నుండి :
శ్మశాన వాటిక – అనే కవితా ఖండిక నుండి :
సాహిత్యంలో మంచి కవిగా పేరొందిన జాషువా శ్శశానం గూర్చి
అత్యద్భుతంగా వర్ణిస్తూ చెప్పిన ఈ పద్యం తెలుగు సాహిత్యంతో
ఎంతో వ్యాప్తమై, కీర్తిని పొంది, స్థిరత్వాన్నందినది!
ఈ పద్యం బలేజిపల్లి వారి సత్య హరిచంద్ర
నాటకం లో కూడ వినిపించేవారుఅబ్బూరి వారు.
.
మా వాచ్ మాన్ చాల బాగా చదువుతాడు..
వాడు అబ్బూరి వారి శిష్యుడు ...(అర్ధం కూడా తెలుసు...7 వ క్లాసు చదివేడు.)
.
.
సీ|| ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని - కలము నిప్పులలోన గఱగిపోయె
యిచ్చోటనే భూములేలు రాజన్యుని - యధికార ముద్రిక లంతరించె
యిచ్చోటనే లేతయిల్లాలి నల్లపూ - సలసౌరు, గంగలో గలసిపోయె
యిచ్చోట నెట్టి పేరెన్నికంగొన్న - చిత్రలేఖకుని కుంచియ నశించె
.
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు - గజ్జెగదలించి యాడు రంగస్థలంబు
.
ఇది మరణదూత తీక్షణ దృష్టు లొలయ - నవని బాలించు భస్మసింహాననంబు
Comments
Post a Comment