గురజాడ అప్పారవు గారి కన్యాశుల్కం (నాటకం)

గురజాడ అప్పారవు గారి కన్యాశుల్కం (నాటకం)


.

గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది.

 కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో,విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు , తమిళం, హిందీ భాషల్లోకి అనువాదమైంది.

కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!

.

.

గురజాడ అప్పారవు గారి కన్యాశుల్కం (నాటకం) గురించి ప్రముఖ కవుల అభిప్రాయాలు

.

.

"కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ

"కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం"-శ్రీ శ్రీ

.

"కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ" - శ్రీశ్రీ

.

"గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!