ఓ అసాధారణమైన రచయిత.!


ఓ అసాధారణమైన రచయిత.!

.

చలనం లేని రాతి సైతం ఆయన రాతలకు చలించిపోతుంది.. ఆయనే ఓ అసాధారణమైన రచయిత “ చలం” (గుడిపాటి వెంకట చలం) గారు.. 

చలంగారిని పోలిస్తే ఒక నిర్ణిద్ర సముద్రంతో పోల్చాలి.. 

ఒక మహా జలపాతంతో పోల్చాలి.. 

లేదా ఒక ఝంఝూనిలంతో నైనా పోల్చాలి... 

.

ఆనాడు ఆయనను గురించి రెండే రెండు అభిప్రాయాలు ఉండేవి.. అవి :

విమర్శిస్తే అతి తీవ్రంగా విమర్శించడం, లేదా అంతే ఘాడంగా అభిమానించడం ...ఫరవాలేదు బాగానే రాస్తాడు అనో, లేదా ఏమి వ్రాసాడు లెద్దూ అనో

చప్పరించి వెయ్యడానికి వీలులేని రచనలను ఆయన చేసారు..

మరొక అభిప్రాయానికి తావులేకుండా రాసేవారు

.

చలం ఏంటి ఇలా వ్రాసాడు ? ఇంత పచ్చి బూతులా ? ఇంత బరి తెగింపా ? అవినీతిని, విశృంఖలత్వాన్ని భోదిస్తున్నాడే ! సంఘాన్ని, ముఖ్యంగా వివాహ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా కూలద్రోయడానికి యత్నిస్తున్నాడే ! హిందూ సంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను, కుల భేదాలను మంట గలుపుతున్నాడే ! ఇలాంటివి ఎన్నో ఆయనను ద్వేషించిన వారి విమర్శ ఇది.. కాని ఈ విమర్శలకు చలంగారు చలించలేదు... తాను నమ్మిన సిద్దాంతాలకోసం సంఘానికి, వ్యక్తులకు ఏది శ్రేయస్కరమని తాము భావించారో ఆ విలువల కోసం ఆయన పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూనే పోయారు.. 

.

స్త్రీ, పురుషుల సంభోగం తో సహా అన్నీ విషయాలలోనూ స్త్రీ కి పురుషునితో సమాన హక్కులు వుండాలి .. యుగ యుగాలుగా పురుషుడికి స్త్రీ బానిసగా పడి వుంది.. పురుష సమాజం స్త్రీ ని అణగద్రొక్కి వేసింది.. ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకు కూడా సొంత ఇష్టా, ఇష్టాలు, అభిరుచులు, స్వేచ్చానురక్తి ఉంటాయని ఊహించలేదు.. కేవలం పిల్లలను కని, వంట చేసి పెట్టే మరబొమ్మగానే స్త్రీ ని పురుషుడు పరిగణించాడు.. ఇది అన్యాయం. పురుషునికున్న స్వేఛ్చ స్త్రీ కి వుండాలి.. అప్పుడు గాని ఆమె వ్యక్తిత్వం పరిపూర్ణం చెందదు అని చలం గారు ఆనాడు ఘోషించారు.. కాలానికి ఎదురీదుతూ, గొప్ప ఆత్మ విశ్వాసంతో, అంచలంచల ధైర్య సాహసాలతో ఆయన తన భావాలను ప్రచారం చేసారు.. తన మొత్తం సాహిత్యాన్ని తన సాంఘిక విశ్వాసాలకు అంకితం చేసారు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!