శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ! .

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం !

.

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|

శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||

అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|

ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

.

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

.

అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునె తిరువనంత పురానికి ఆ పేరు వచ్చినది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్థు గా పెట్టుకున్నారు. ప్రస్తుత మున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడ డానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్ల్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వార గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!