వేమన పద్యాలు -- విమర్శ

వేమన పద్యాలు -- విమర్శ

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?

.

.

కనక మృగము భువిని కద్దులేదనకుండ

తరుణి విడిచిపోయె దాశరధియు

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?

విశ్వదాభిరామ వినురవేమ.

.

.

ఈ పద్యం ప్రక్షిప్తం కాదు. వేమన శతకము మీద పరిశోధన చేసిన ఆచార్య గోపి పుస్తకాలలోనూ ఉన్నది. 

ఈ పద్యం వ్రాసే సమయానికి వేమారెడ్డి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. యోగా, లేదా భోగా అనేది మనకు అనవసరం. ఆయన వ్రాసినది శ్రీరామునికి బంగారు లేడి ఉండదని తెలియకుండా భార్యని వదిలి వెళ్ళాడు అనే వ్యంగ్యారోపణ చేస్తున్నాడు. ఈయన ఏ రామాయణం చదివి ఇలా అన్నాడో తెలియదు. జానపదులు పాడుకునే రామాయాణాలలో కొంత నిందాస్తుతి ఉండటం సహజం. అయితే ఈ పద్యం నిందాస్తుతి అనుకోవడానికి వీలులేదు. నిందాస్తుతి చెయ్యటానికి కర్త ఆ దైవానికి భక్తుడై వుండాలి. వేమారెడ్డి భోగలాలసుడే కానీ, శ్రీ రామ భక్తుడు అని చరిత్రకారులు ఎక్కడా చెప్పలేదు. సంస్కృత రామాయణము చదివాడు అనడానికి ఆధారాలు ఆయన చరిత్రలో మనకి లభించడములేదు. 

ఆయనకి సంస్కృతం వచ్చు అని ఒక చరిత్రకారుడు చెప్పాడు

ఇఖ శ్రీ రామాయణం లో ఏమి ఉన్నది చూద్దాం. .

.

అరణ్యకాండ : 43వ సర్గ : 7 వ శ్లోకం .

.

.

లక్ష్మణుడు రామునితో ఇలా అంటాడు. .

.

.

మృగో హ్యేవంవిధో రత్న

విచిత్రో నాస్తి రాఘవ ।

జగత్యాం జగతీనాథ

మాయైషా హి న సంశయః ॥.

.

.

ఓ రాఘవా !! ఇలాంటి మృగం లోకంలో ఎక్కడా ఉండదు. 

సంశయం లేకుండా ఇది రాక్షస మాయయే !!

దానికి శ్రీరాముడు ఇలా అంటాడు. ( 37,38,39 శ్లోకాలు ).

.

యది వాఽయం తథా యన్మామ్

భవేద్వదసి లక్ష్మణ ।

మాయైషా రాక్షసస్యేతి

కర్తవ్యోస్య వధో మయా ॥.

.

.

ఓ లక్ష్మణా !! నువ్వు చెప్పినట్లు ఇది రాక్షస మాయ యైన ఈ మృగాన్ని నేను చంపి తీరాలి. 

ఏతేన హి నృశంసేన

మారీచేనాకృతాత్మనా ।

వనే విచరతా పూర్వమ్

హింసితా మునిపుఙ్గవాః ॥.

.

.

.

ఈ మారీచుడు అనేవాడు ఈ వనంలో తిరుగుతూ మునులను చాలా హింసించాడు. .

.

.

ఉత్థాయ బహవో యేన

మృగయాయాం జనాధిపాః ।

నిహతాః పరమేష్వాసాః

తస్మాద్వధ్యస్త్వయం మృగః ॥.

.

.

వీడు చాలామంది యోధులను కూడా చంపాడు కావున వేడిని చంపాల్సిందే !! .

.

.

తమ్ముడు లక్ష్మణుడు హెచ్కరికగా మాట్లాడిన మాటల వలన ఆ మృగం నిజమైన మృగం కాదని శ్రీరామునికి తెలుసు. ఇక్కడ మన వేమారెడ్డి గారు ఆ విషయం శ్రీరామునికి తెలియదని ఎలా పోరబద్దారో విశదం కాదు. .

.

.

బహుశా: మనకేదో నీతి చెప్పాలని శ్రీరాముని తో పోల్చి చెపితే జనులు అర్ధం చేసుకుంటారని వేమారెడ్డి చెప్పాడు అనుకుందాం అనుకుంటే, ఈ పద్యంలో నీతి కానరాదు. దైవ దూషణ మాత్రమే కనిపిస్తుంది. .

.

శ్రీరాముడు తానూ భగవంతుడునని రామాయణం లో ఎక్కడా చెప్పుకోలేదు. విష్ణుమూర్తి గానే ఇష్టి పూర్తీ కాగానే దేవతలకు మాత్రమే తాను దశరధుని కుమారునిగా అవతరిస్తున్నానని చెపుతాడు. దాశరథిగానే ఆయన జీవించాడు. ,

,

,

వేమారెడ్డి గారు కేవలం భోగలాలసతోనే శ్రీరాముని ప్రజలు దైవంగా పూజించటం సహించలేక దైవ దూషణ చేశారని భావించాలి. స్వస్తి. 

రేపు పిండ ప్రదానాల పద్యం మీద వివరణ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!