శారద పోలంరాజు గారి విక్రమార్కుడు కధ!

శారద పోలంరాజు గారి విక్రమార్కుడు కధ!

.

ఒక రాజ్యం ఏలే రాజుకు చాలా అందమైన భార్య ఉండేది. ఆమె మోజులో పడ్డ రాజు రాచకార్యాలన్ని వదిలేస్తే మంత్రి చాకచక్యంగా నడిపిస్తూ ఉంటాడు.

అంత శ్రమ పడుతున్నా ప్రజలు మంత్రిని అపార్ధం చేసుకొని, ఈ మంత్రి రాజును మాయబుచ్చి రాజ్యమంతా తన వశపరుచుకుంటాడు." అంటూ అపనిందలు వేయడం అతని చెవిన పడి, మనసు కలత చెంది, దేశం వదిలి తీర్ధయాత్రకు బయలు దేరిపోతాడు.

ఆ విషయం విన్న రాజు కలత చెందుతాడు.

అట్లా పోయిన మంత్రి ఒక రేవు పట్టణం చేరుకొని ఒక వ్యాపారిని కలుసుకుంటాడు. ఇద్దరికి మంచి స్నేహం కలుగుతుంది. ఎన్నో విషయాలు చర్చిస్తూ కాలం గడుపుతూ ఉండగా ఒకసారి వర్తకుడు వ్యాపార నిమిత్తం నౌకలో పొరుగు దేశం వెళ్ళాల్సి వస్తుంది. మంత్రి కూడా అతనితో బయలుదేరి పోతూ ఉండగా నౌక తుఫానులో చిక్కుకొని మార్గము తప్పి ఎక్కడికో వెళ్ళిపోతూ ఒక దీవి చేరుకుంటుంది.

వారిరువురూ నౌక నుండి దిగి తిరుగుతూ ఉండగా ఒక పాత దేవాలయం కనిపిస్తుంది. నర సంచారము ఉండదు కాని అక్కడ ఒక రావి చెట్టు కింద అత్యంత సుందరమైన అమ్మాయి కనిపిస్తుంది.

అంత అందమైనది అంటే మానవ కాంత కాదు ఏ దేవకాంతో అని భయపడి తిరిగి నౌక ఎక్కి తిరుగు ప్రాయాణం చేస్తారు.

కొంత కాలానికి మంత్రికి తన ఊరు వెళ్ళిపోదామనిపించి వర్తకుడికి చెప్పి అతను ఇచ్చిన కానుకలు తీసుకొని తన ఊరు చేరుకుంటాడు. 

రాజుగారు ఆదరించి ఇంతకాలమూ తిరిగిన ఊళ్ళు వింతలు విశేషాలూ చెప్పమని అడుగుతాడు.

మంత్రి తాను చూసిన దీవి అక్కడ కనిపించిన అందమైన అమ్మాయి గురించి వివరిస్తాడు.

వెంటనే రాజుకు ఆ అమ్మాయిని చూద్దామని ఆరాటం కలుగుతుంది. మంత్రిని వెంటబెట్టుకొని ఆ దీవికి బయల్దేరుతాడు.

ఆ అందాలరాశిని చూసి ప్రేమలో పడి తనను పెళ్ళిచేసుకోమని అడుగుతాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. కాని అష్టమి గాని అమావాస్య గాని వచ్చే వరకు వేచి ఉండాలని నియమం విధిస్తుంది. 

ఆ కోవెలలో ఒక వ్రతము మొదలెట్టి పుష్కరిణిలోకి స్నానం చేయటానికి వెళ్తుంది.

అట్లా ఒక్కతిని వదలటానికి మనసు ఒప్పని రాజు ఆమెను వెన్నాడే ఉంటాడు.

అంతలో భీకరమైన శబ్దం వినిపించి అది ఏమిటో గమనించే లోగానే ఒక రాక్షసుడు ఆమెను అమాంతం నోట్లో పెట్టుకొని మింగేస్తాడు.

రాజు తేరుకొని ఆ రాక్షడి మీదకు దూకి అతని పొట్ట చీల్చేస్తాడు.

అందులొ నుండి ఆ అమ్మాయి సురక్షితంగా బయట పడుతుంది. 

ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో, "రాజా నా తండ్రి ఇంద్రుడి వద్ద పండితుడు. నేనంటే ఎంతో ప్రేమ. పక్కన లేనిదే భోజనం చేసేవాదు కాదు. అట్లా ఉండగా ఒక అష్టమి నాడు గౌరీ వ్రతం ప్రారంభించిన నేను కోవెల నుండి భోజనానికి రావడం ఆలస్యమౌతుంది.

ఆకలితో నీరసించి పోతున్న మా తండ్రి కోపం పట్టలేక రాక్షసుడు నిన్ను మింగు గాక. అని శపించాడు.

ఆయన కాళ్ళ మీద ప్రాధేయపడగా కోపం తగ్గిన ఆయన, "అట్లా నిన్ను మింగిన రాక్షసుడిని చంపి నిన్ను కాపాడే వ్యక్తి తారసిల్లిన నాడు నీకు శాప విముక్తి కలుగుతుంది. అప్పటి దాకా పార్వతీదేవిని ప్రార్ధించు. ప్రతి అష్టమీ అమావాస్యనాడు రాక్షడు నిన్ను మింగుతాడు. ఆ మరురోజు నిన్ను బయటకు కక్కుతాడు" అని శాప విమోచనం కూడా సూచిస్తాడు.

"ఓ రాజా ఆ నాటి నుండి నేను ఈ దేవీ ఆలయంలో తల్లిని సేవించుకుంటూ శాపవిమోచనం చేయగలిగే వీరుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంత కాలానికి నా పూజలు ఫలించాయి. నన్ను వివాహం చేసుకో." అంటుంది.

రాజు పరమానందంగా ఆమెను వివాహం చేసుకొని రాజ్యానికి తిరిగి వస్తాడు.

కాని నగరానికి చేరిన మరురోజే మంత్రి ఉరి పోసుకొని మరణిస్తాడు.

మిత్రులారా కథ వివరంగా చదివారు కదా! మరి ఆలస్యం దేనికి?మంత్రి మరణానికి కారణం వెతికేసేయండి. విక్రమార్కుడికి సమాధానం చెప్పడంలో సాయం చేయండి.

అసలే భార్య సౌందర్యం పట్ల అంతు లేని మోహం ఉన్న రాజు రాజ్యపాలన మర్చిపోయినాడు. అది చాలక మరొక సుందరిని పెళ్ళి చేసుకొనేందుకు నేనే కారణ భూతుడనయ్యాను.

ఇప్పుడు రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు. దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నా మీద మరిన్ని అపవాదులు వేస్తారు. అనవసరంగా రాజుకు నేను ఆ ద్వీపం గురించీ, అందులోని అందమైన యువతి గురించీ చెప్పి, రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను. ప్రజానింద భరింప శక్యం కానిది అనుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు.......ఇది విక్రమార్కుడి సమాధానం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!