పుష్పక విమానం:!

పుష్పక విమానం:!

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.

రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.

సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించ బడింది. సితాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించ బడింది.

.

(సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారివర్ణన.)

.

యమకుబేర వరుణ దేవే0ద్రాదుల / సర్వస0పదల మి0చినది

విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది / బ్రహ్మవరమున కుబేరుడ0దినది

రావణు0డు కుబేరుని రణమ0దు / ఓడి0చి ల0కకు గొని తెచ్చినది

పుష్పకమను మహావిమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

.

నేలను తాకక నిలచియు0డునది /రావణ భవన మద్య0బుననున్నది

వాయు పథమున ప్రతిష్టితమైనది / మనమున తలచిన రీతి పోగలది

దివిను0డి భువికి దిగిన స్వర్గమది / సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది

పుష్పకమను మహా విమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

.

దేవశిల్పి అయిన విశ్వకర్మ, బ్రహ్మదేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్దనుండి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి "కైకసి" దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకొన్నాడు. రావణ వధానంతంరం శ్రీరాముడు దానిని ఎక్కి లంక నుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునికిచ్చాడు.

మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!