చిత్రాంగి గడుసుదనానికి,సారంగధరుని మాటకారి తనం!

చిత్రాంగి గడుసుదనానికి,సారంగధరుని మాటకారి తనం!

( శ్రీ చొప్పకట్ల సత్యనారయణ గారి విశ్లేషణ.)

.

మనం ఆంధ్రసాహిత్యంలో కవులు రంగరించిన చమత్కారాలను

రోజూతెలిసికొంటూ ఉన్నాం .అందులో భాగంగా ,ఈరోజుచేమకూరదే మరోపద్యం పరిశీలిద్దాం. 

.

.

ఉ: నిక్కగ జూడు చిత్రమిది నెమ్మది వేడుక నోలలాడు, న

మ్మక్కల గుట్టు బట్టబయలై కనుపింపగ శౌరి కొమ్మపై

కెక్కి, రమించుచున్కి, యౌలే, మగువా! యిది చిత్రమౌట దా

నిక్కము; కృష్ణలీలగద నీ విపుడెన్నిన మార్గమంతయున్;

.

ఇందులో చిత్రము కొమ్మ రమించు, అనేపదాల నానార్ధల గణింపులోనేఉందిచమత్కారమంతా.చిత్రాంగిఅంటోంది" 

ఇదిగిదిగో యీచిత్రంచూడవయ్యా!

కృష్ణుడు గోపికతో యెలారమిస్తున్నాడో?" అంటోంది.

( యిక్కడ, కొమ్మ- అనేపదం ఆడదానికిపర్యాయపదం. రమించు =క్రీడించు;చిత్రం!= ఆశ్చర్యం!) 

.

దానికిసారంగధరునిసమాధానం" ఔనులే అదిచిత్రమే(చిత్రపటమే) (అతడావంకకైనాతిరిగిచూడలేదు) 

.

నీవుచేప్పినదికృష్ణలీలను గురించిగదా" అంటున్నాడు.

శ్రీకృష్ణుడుగోపికలుజలకమాడువేళవారిచీరలనుగొనిపోయి,పొన్నచెట్టుకొమ్మపైగూర్చుండి పైకి రమ్మనిసరసమాడెనుగదా ఆవిషయమునుప్రస్థావించినాడు.

ఈరెండవపక్షమున కొమ్మ=వృక్షశాఖ; చిత్రము=ఫొటో; రమించు= ఆటలాడు; చూచితిరాచేమకూరచమత్కారము

.చిత్రాంగిగడుసుదనానికి,సారంగధరునిమాటకారి తనంతో సమాధానమిప్పించినాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!