కరుణశ్రీ కవిత్వం......(అద్వైతమూర్తి).

.

చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా

లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం

కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో

దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ..

.

మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్

గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ

వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం

దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్..

.

భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్

తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో

నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ

ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్...

x

Comments

  1. Sir, namaste.శ్రీమతి P. లీల గారు పాడిన " కోమలా పల్లవ పాణి ' పాట కోసం (ఆడియో )కోసం మీ బోటి చక్కని అభిరుచి గల వారినందరిని కోరుతున్నాను.1968 లో వచ్చిన' గ్రామదేవతలు ' అనే చిత్రంలోది . మీ వద్ద వుంటే పోస్ట్ post చేయండి .
    ధన్యవాదాలు
    Ravi Krishna Charepalli
    Mathematics faculty
    Hyderabad


    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!