తెలుగు తెలుసుకోండి....పంచమీ విభక్తి! .

తెలుగు తెలుసుకోండి....పంచమీ విభక్తి!

.

వలనన్; కంటెన్ ; పట్టి – పంచమీ విభక్తి (fifth preposition)

(i) వలనన్ (because); 

సింహము వలన భయము (fear because of lion).

(ii) కంటెన్ /కన్నా (than) 

అందరి కంటే గొప్పవాడు (superior than all others),

ఆ చొక్కా కన్నా ఇది బాగుంది (this shirt is better than that).

(iii) పట్టి (according); 

పనిని బట్టి జీతము (salary according to work).

ఆంగ్లంలో ‘because’ అని చెప్పటం ‘వలన’ ప్రత్యయానికి ఒకరకంగా అతి సూక్ష్మీకరణమే.. చిన్నయ సూరి బాల వ్యాకరణం ప్రకారం – అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతార్థి, వారణంబు లెద్దాన నగు దానికి ‘వలన’ వర్ణకంబగు..అని చెప్పబడింది.

ఆధునిక తెలుగు భాషలో చాల సార్లు పంచమీ ప్రత్యయం ‘వలన’ బదులుగా ‘కు’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం సర్వ సాధారణంగా వాడుతున్నారు..(ఇది సంస్కృత వ్యాకరణ సూత్రాలకు విలక్షణమైన తెలుగు నుడికారం)

ఉదా:

దశరథుని వలన రాముడు పుట్టెను (‘భవన’ అర్థంలో పంచమి)

మారి, 

దశరథునకు రాముడు పుట్టెను (‘కు’ షష్ఠీ ప్రత్యయం) 

అవుతుంది.

ఇదే కాక – గ్రహించుట (తీసుకొనుట) అనే అర్థంలో పంచమీ ‘వలన’ బదులుగా ‘చేత’ వాడటం కూడ కద్దు. (ఇది కూడా సంస్కృతంలో ప్రయోగించని, తెలుగు లక్షణమే)

ఉదా:

మిత్రుని వలన ఆహారము తీసుకొనెను 

మారి 

మిత్రునిచే ఆహారము తీసుకొనెను 

అవుతుంది.

సూత్రంలో చెప్పబడిన ‘వలనన్, కంటెన్, పట్టి’ ప్రత్యయాలే కాక, ‘వలన’ కు ‘ఉండి’ అనే ప్రత్యయం అనేక సార్లు ‘అను’ ప్రయుక్తమవుతుంది… (అంటే ‘వలనన్+ఉండి’ – ‘వలన నుండి’ అవుతుంది)…. ఇది పంచమీ విభక్తి రూపమే అయినా ఇలా వాడుకలో కనబడటం అరుదు…

ఉండిపదంబొకానొకచో వలన వర్ణకంబున కనుప్రయుక్తంబగు.

ఈ సందర్భాలలో పంచమి బదులు ద్వితీయా (ని, ను), సప్తమీ (న) ప్రత్యయాలు ‘వలనన్’ కు బదులు గా వస్తాయి.

ఉదా:

వనము వలన నుండి వచ్చెను (‘వలన నుండి’ – పంచమి)

మారి

వనమును+ఉండి = వనమునుండి వచ్చెను (‘ను’ – ద్వితీయా)

లేదా

వనమునందున్+ఉండి = వనమునందుండి వచ్చెను (‘అందున్’ – సప్తమీ ప్రత్యయం) 

అవుతుంది.

‘ఉండి’ ప్రత్యయం – వాడుకలో ‘నుండి’ అయి, ‘నుంచి’ గా రూపాంతరం చెందుతుంది… కాని ‘ఉండి’ అనేదే సరైన పదం.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!