హనుమంతుని వివాహం.! (శారద పోలంరాజు గారి విశ్లేషణ.)

హనుమంతుని వివాహం.!

(శారద పోలంరాజు గారి విశ్లేషణ.)

హనుమంతుడు ఆజన్మబ్రహ్మచారి కదా ఆయనకు వివాహమయినట్టు కొన్ని చోట్ల ఉన్నది......అని చాలా మందికి సందేహము. ....

హనుమంతుడి గురించిన కథలు పరాశర సంహితలో కనిపిస్తాయి.

సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంజనతో వివాహం అవుతుంది.

కాని ఆమె సూర్యుడి తేజస్సు తట్టుకోలేక పోతుంది. ఆ వేడి భరించలేక పోవటంతో విశ్వకర్మ సూర్యుడిని తన తేజస్సు తగ్గించుకోమని వేడుకుంటాడు.

సూర్యుడి అనుమతితో విశ్వకర్మ కొంత వెలుగును తొలగించి అట్లా వచ్చిన వెలుగుతో ఒక అందమైన అమ్మాయిని సృష్టిస్తాడు.

సూర్యుని వర్చస్సుతో రూపొందిన ఆ అమ్మాయి సువర్చల అన్న పేరు పొందుతుంది.

అంత అందమైన అమ్మాయికి వరుడు ఎవరా అని అందరు దేవతలు విచారిస్తూండగా బ్రహ్మ, "శివుని అంశమైన హనుమంతుడు ఆ అమ్మాయికి తగిన వరుడు." అని సూచిస్తాడు. 

*******************************************

హనుమంతుడు పెరిగి పెద్దవాడవుతూండగా అతన్ని విద్యాభ్యాసం కోసం సూర్యుడి వద్దకు పంపిస్తుంది తల్లి. 

కాని సూర్యభగవానుడు నిరంతరమూ తిరుగుతూ ఒక్కచోట ఉండక పోవటం చేత హనుమ ఆయనకు ఎదురుగా ఉండి వెనక్కు నడుస్తూ అట్లా తిరుగుతూ ఉన్న సూర్యుడి వద్ద సకల శాస్త్రాలూ నేర్చుకుంటాడు.

ఇక్కడ రెండు రకాల కధనాలు ఉన్నాయి.

ఒక వృత్తాంతం ప్రకారం విద్యాభ్యాసం అయిపోయాక సూర్యుడు గురుదక్షిణగా తన కూతురైన సువర్చలను వివాహమాడమని అడుగుతాడు......

మరో వృత్తాంతం ప్రకారం,

హనుమంతుడు ననవ్యాకరణాలను నేర్చుకో దలచి శనిభగవానుడి వద్దకు వెళ్తాడు. కాని ఆ విద్య నేర్చుకోవటానికి బ్రహ్మచారులకు అర్హత లేనందున సూర్యుని కూతురును పెళ్ళి చేసుకోవలసి వచ్చింది అని అంటారు.

సరే......ఏది ఏమైనా హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకోవలసిన థితి ఏర్పడుతుంది.

కాని ఆయన ఆజన్మ బ్రహ్మచర్య దీక్షలో ఉన్నందున వివాహానికి నిరాకరిస్తాడు.

"సువర్చల దైవాంశ సంభూతురాలు అయోనిజ. ఆమెను వివాహమాడినంత మాత్రాన నీ ప్రాజాపత్య బ్రహ్మచర్యానికి ఏ దోషమూ రాదు. లోక కళ్యాణం కోసమే ఈ వివాహము." అని దేవతలు హనుమంతుడికి వివరిస్తాడు.

అట్లా సువర్చలా హనుమంతుల వివాహం జరుగుతుంది.

హనుమంతుడు తన బ్రహ్మచర్యం కొనసాగిస్తూ ఉండగా సువర్చల గంధమాదన పర్వతం మీద తపోనిష్టలో ఉండిపోయింది.

"జ్యేష్ట్య శుక్ల దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాంసుతాం సువర్చలానామ్నాం ప్రాదాత ప్రీత్యా హనూమతే"

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!