ధూర్జటి !

ధూర్జటి !

.

పవి పుష్పం బగు, నగ్ని మం చగు, నకూపారంబు భూమీస్థలం

బవు, శత్రుం డతి మిత్రుఁడౌ, విషము దివ్యాహారమౌ నెన్నగా

నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాష ణోల్లాసికిన్

శివ! నీ నామము సర్వవశ్య కరమౌ! శ్రీ కాళహస్తీశ్వరా! 

.

శంకరా! లోకంలో శివనామోచ్చారణ చేసే పుణ్యాత్మునికి, వజ్రము పువ్వవుతుంది. అగ్ని మంచు అవుతుంది. సముద్రం నేల అవుతుంది. శత్రువు మిత్రుడవుతాడు. విషం అమృతం అవుతుంది. పరమశివా! నీ నామము లోకంలోని అందరినీ వశం చేసుకునే ఉత్తమసాధన అవుతుంది.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.