సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం !

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం!


మహామ్భోధి తీరే మహాపాప చొరే

మునీంద్రానుకూలే సుగాన్ధఖ్య శైలే

గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం

జనార్తిం హరన్తం శ్రయామో గుహంతమ్


మహాసముద్ర తీరమున,సకల పాపములు హరించు, మునులకు ఆవాసము అగుగంధ పర్వత గుహలలో తన కాంతితో ప్రకాశించూచు, నివసించువాడు, జనుల బాధలను హరించు వాడును నాడు కుమారస్వామిని సేవింతును.


లసత్స్వర్ణ గేహే నృణా౦కామదోహే

సుమ స్తోమ సంచాన్న మాణిక్య మంచే

సముద్య త్సహస్రార్కతుల్యప్రాశం

సదా భావయే కార్తికేయం సురేశమ్


మనుజుల కోరికలు తిర్చుటకు, బంగారు భవనమున, పుష్ప సముదాయచే కప్పబడిన రత్నాసనమున, ఉదయ సూర్యుల కాంతితో సమానమైన వేలుగుగల దేవతా శ్రేష్టుడయిన కుమారాస్వామిని నిరంతరము తలచెదను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!