ఆపేక్ష! (కాంచన విపంచి- శ్రీమతి చావలి బంగారమ్మ)

ఆపేక్ష!

(కాంచన విపంచి- శ్రీమతి చావలి బంగారమ్మ)

ఆపేక్షగల అన్న అర్ధచంద్రుడైతె

అది వదినకిత్తునూ అణచి ముక్కున బెడుదు

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ..

నా సిగలో పువ్వల్లె నలినాక్షి పెదవదిన

నలిగిపోయీ నన్ను తొలగి చూచునొ యేమొ

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ...

పులకరించని మేన పలుకరించని తాను

పట్టిలాగుచు బాధపెట్టునేమో నన్ను

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ..

చుక్కంటి మావదిన చక్కన్ని చూపులో

చిక్కబట్టిందంటె టక్కరైపోతాడె

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ..

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !