కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

Sir, namaste.శ్రీమతి P. లీల గారు పాడిన " కోమలా పల్లవ పాణి ' పాట కోసం (ఆడియో )కోసం మీ బోటి చక్కని అభిరుచి గల వారినందరిని కోరుతున్నాను.1968 లో వచ్చిన' గ్రామదేవతలు ' అనే చిత్రంలోది . మీ వద్ద వుంటే పోస్ట్ post చేయండి .
ReplyDeleteధన్యవాదాలు
Ravi Krishna Charepalli
Mathematics faculty
Hyderabad