కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi) ...By.."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu
కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi) అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశ తు్రః " అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది. రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది. ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు. త|| "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్" వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వం...