మరిన్నికాసిడు ముళ్ళపూడి వారి జోకులు .!

మరిన్నికాసిడు ముళ్ళపూడి వారి జోకులు .!
ఒక పెద్దమనుషి డాక్టరు దగ్గరకు వెళ్ళాడు.
"రోగం ఫలానా అని చెప్పలేనుగానీ ... ఏమిటో ఎప్పుడు చెవులు హోరెత్తిపోతూ ఉంటాయండి. ఇంట్లో ఇంత చిన్న చప్పుడయినా అదిరిపడతాను. జుట్టు నెరవకపోయినా భగవద్గీత చదవాలనిపిస్తుంది. రాత్రిళ్ళు నిద్దర పట్టదు. విసుగు ... చిరాకు .. భయం ... కంగారు ... త్రోటుపాటు ఎక్కువైపోయింది ..."
" అవునవును. తెలుసు. నాకూ పెళ్ళయింది లెండి" ... అన్నాడు డాక్టరు సానుభూతి ప్రకటిస్తు.
...........................................................
ఎదుగుబొదుగు లేని వేమిటని అడిగారు మాష్టారు

"తెలుగు సినిమా" అన్నాడు ఎడిటరు గారబ్బాయి.
"నీ జీతం నాన్న" అన్నాడు సుపుత్రుడు.
"వడ్డి లేని అప్పు" అన్నాడు సెట్టిగారబ్బాయి.
"సినిమాతార వయసు" అన్నాడు ఎదుగుతున్న బిడ్డడు.
"గొర్రెతోక" అన్నాడు ఎదుగూ బొదుగూ లేని విద్యార్థి.
"సరే నీ బుర్రకూడా వొకటనుకో" అన్నాడు మాష్టారు.
..........................
తలా తోకా లేనివి : తెలుగు సినిమా కథ, ఎన్నికల వాగ్దానాలు
................
"ఈపూట మీ ఇంట్లో కూరేం చేసారూ?"
"ఏంచేస్తాం, తిన్నాం"
................................
స్త్రీల కాలమానం దేవతల కాలమానానికి దగ్గరగా ఉంటుంది - ముఖ్యంగా అలంకరణ విషయంలో. సినిమాకి వెళ్ళేముందు - ఒక మాములు క్షణం ఒక పురుషయుగం. అలాటి పురుషయుగాలు రెండు కోట్లు కలిస్తే ఒక స్త్రీనిముషం. అలాటి నిముషాలు నూటయాభై అయితే ఒక చీర సింగారింపు. నూరు చీరసింగారింపులు ఒక పోడరు కోటా. నూరుకోటాలకాలం ఒక తిలక ధారణ. నూరు తిలకాలు కలిస్తే ఒక దర్పణప్రతిబింబ పర్యవేక్షణ
.... ముళ్ళఫూడి
.........................................................
1954 లో వచ్చిన ' వద్దంటే పెళ్లి ' చిత్రం మీద సమీక్ష రాస్తూ ముళ్ళపూడివారు .................
" ఈ చిత్రం నిడివి మూడు మైళ్ళ ఐదు ఫర్లాంగుల తొమ్మిది గజాలు లేదా మూడు గంటల ముఫ్ఫై ఏడు నిముషాల పదిన్నర సెకన్లు " అంటూనే ................
" రెండో ఆటకి పిల్లాజెళ్ళతో వెళ్ళేవాళ్లు పకోడీలు, జంతికలూ వగైరా చేసుకుని రెండు మరచేంబులతో మంచినీళ్ళు పట్టుకుని మరీ వెళ్ళడం మంచిది " అని సలహా కూడా ఇస్తారు
...........

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!