శ్రీ కృష్ణ శతకం.!........( 12/6/15)... (శ్రీ నరసింహ కవి.)
శ్రీ కృష్ణ శతకం.!........( 12/6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగధర కృష్ణా
.
ప్రతిపదార్థం:
నారాయణ అంటే నీరు నెలవుగా ఉన్న; లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవికి భర్త అయిన;
నారాయణ అంటే అవతారాలు ధరించినప్పుడు మానవ రూపం కలిగిన;
వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడివైన; నందకుమారా అంటే నందుని కుమారుడివైన; నారాయణ అంటే శబ్దమే గమ్యంగా కలవాడివి; నిను అంటే అటువంటి నిన్ను;
నమ్మితి అంటే నమ్మాను; నారాయణ అంటే నరుల సమూహానికి నెలవైనవాడివి;
నగధర అంటే కొండను ధరించినవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా!
నన్ను అంటే సామాన్య మానవుడనైన నన్ను; బ్రోవు అంటే రక్షించు.
.
భావం:
నీరు నెలవుగా ఉన్న ఓకృష్ణా! లక్ష్మీదేవికి భర్తయైనవాడా! అవతారాలు ధరించిన సమయంలో మానవరూపం ధరించినవాడా,
అన్ని లోకాలను నీయందే కలిగినవాడా,
నందుని కుమారుడా, శబ్దమే గమ్యంగా కలవాడా
, నిన్నే నమ్ముకున్నాను. మానవ సమూహానికి స్థానమైన ఓ కృష్ణా!
కొండను ధరించిన నీవు నన్ను రక్షించు.
Comments
Post a Comment