ఆంద్ర కవితాపితామహ! యల్లసాని - పెద్దన కవీంద్ర!
అల్లసాని పెద్దన రాయలకు ప్రియతముడైన మహాకవి;
అతడు తన్ను రాయలెట్లు గౌరవించి యాదరించెనో
రాయల మరణానంతరము రచించిన
ఈ క్రింది చాటువులో వివరించియున్నాడు:
ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి - కేలూత యిచ్చి యెక్కించుకొనియె
.
మనుచరిత్రం బందుకొనువేళ బురమేగఁ - బల్లకిఁ దనకేలఁ బట్టియెత్తె
.
బిరుదైన ఘనగండపెండేరమున కీవె - తగునని తానె పాదమున దొడగె
.
కోకట గ్రామా ద్యనేకాగ్రహారంబు - లడిగిన సీమలయందు నిచ్చె
.
నాంధ్రకవితాపితామహ! యల్లసాని - పెద్దన కవీంద్ర! యని
నన్ను బిలుచునట్టికృష్ణరాయలతో దివి కేగలేక -
బ్రతికియున్నాఁడ జీవచ్ఛవంబు కరణి.

Comments
Post a Comment