_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22 /6/15.)


_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(22 /6/15.)
.
నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!
.

ఈశ్వరా!
బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా?
దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా?
తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్టి, తింటే గానీ వీల్లేదన్నానా?
ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!