అమృత వర్షిణి.!


అమృత వర్షిణి.!
అద్వైతాన్ని
అమరత్వాన్ని
అనంత జీవన ప్రవాహాన్ని
ఆద్యంత రహితమైన కాలాన్ని
నా పేరే అమృత వర్షిణి

బంధాన్ని
ప్రణయ ప్రబంధాన్ని
ప్రాయపు సరసులో
అరవిరిసిన అరవిందాన్ని
నా పేరే అమృత వర్షిణి
రాగాన్ని
సరస సరాగాన్ని
నీ హృదయం ఆసాంతం
నిండి ఉన్న అనురాగాన్ని
నా పేరే అమృత వర్షిణి
వేదాన్ని
ప్రణవ నాదాన్ని
ప్రకృతి వైవిధ్యాలుగా
వ్యక్తమౌతున్న ఏకత్వాన్ని
నా పేరే అమృత వర్షిణి
నీ కవిత్వాన్ని
నీ జీవన సమస్తాన్ని
నీ మధుర భావాలలో
సదా వ్యక్తమౌతున్న సత్యాన్ని
నా పేరే అమృత వర్షిణి
స్వరాన్ని
దైవ దత్తమైన వరాన్ని
శృతి సుమ పరిమళాల్ని
వెదజల్లు మలయ సమీరాన్ని
నా పేరే అమృత వర్షిణి
కావ్యాన్ని
కవి హృదయాన్ని
ఆ హృదయం పై ఎన్నటికి
మానని గాయాన్ని
నా పేరే అమృత వర్షిణి.!
.
(శ్రీ సునీల్ కుమార్ గారి..అమృత వర్షిని నుండి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!