గోపాల దొంగ మురహర......శ్రీ కృష్ణ శతకం.!........( 8/6/15)... (శ్రీ నరసింహ కవి.)

 

.

శ్రీ కృష్ణ శతకం.!........( 8/6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
గోపాల దొంగ మురహర
పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!
.
భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు.
లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి.
పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను.
నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
.
ప్రతిపదార్థం: గో అంటే స్వర్గలోకాన్ని; పాల అంటే పరిపాలించినవాడా;
దొంగ అంటే లీలామానుషుడివి అయినవాడా;
మురహర అంటే మురుడు అనే పేరు
గల రాక్షసుడిని చంపినవాడా; గోపాల అంటే గొల్లపిల్లవాని;
మూర్తి అంటే ఆకారం కలిగినవాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా;
పాపాలను అంటే తప్పు పనులు చేయడం వలన వచ్చే ఫలితాన్ని;
పారద్రోలు అంటే పోగొట్టగల; ప్రభుడవు అంటే రాజువు; నీవే అంటే నువ్వే;
నిశ్చయము అంటే ఇది నిజమని; నమ్మితి అంటే నమ్మాను;
నా పాలిట + కలిగి అంటే నాయందు దయ కలిగి; బ్రోవుము అంటే రక్షించుము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!