పోతన - శ్రీమద్భాగవతం ..పద్యం.


పోతన - శ్రీమద్భాగవతం ..పద్యం.
.
బహుకుటుంబి యగుచు బహు ధనాపేక్షచే
నెండమావుల గని యేగు మృగము
కరణి బ్రేమ జేసి పరువులు వాఱుచు
నొక్కచోట నిలువకుందురెపుడు
.
ఈ మనుషులు తమతమ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటారు
.డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటారు.
లేళ్లు ఎండమావుల వెంట పరుగులు తీసే విధంగా కోరికలను
నెరవేర్చుకోవాలనే అత్యాశతో మానవులు
ఎక్కడా నిలకడగా ఉండక
నిరంతరం పరుగులు పెడుతుంటారు.
.
అంతగొందఱల్ల నన్యోన్య విత్తాది
వినిమయమున గడుబ్రవృద్ధమైన
వైరములను బొంది పోరాట వొందుదు
రాత్మ చింతలేక యనుదినంబు
.
కొందరు డబ్బుకి సంబంధించిన లేదా ద్రవ్యానికి సంబంధించిన
లావాదేవీల కారణంగా ఒకరితో ఒకరికి శత్రుత్వం ఏర్పడుతుంది.
అంతేకాక ఆ శత్రుత్వం రోజురోజుకీ పెరుగుతుంది.
ఇలా నిరంతరం పోరాడే స్వభావంతో ఒకరిమీద

ఒకరికి ప్రేమ, అభిమానం లేకుండా పోతాయి.








Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !