శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(4/ 6 /15.)

 .

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(4/ 6 /15.)
.
దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతన్మేన చరింపనప్పుడె కురుల్వెల్లంగ గానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా !
.
శంకరా ! ముసలితనం వచ్చి దంతాలు ఊడి పడిపోకముందే , శరీరపటుత్వం తగ్గక ముందే,ఆడవారు అసహ్యించుకోక ముందే , వెంట్రుకలు తెల్లపడక ముందే , ముసలి తనం ఆక్రమించుకొని శరీరం లోకి వింత వింత రోగాలు ప్రవేశించక ముందే నీ పాదాలను ఆశ్రయించి ధ్యానించుకోవాలి.
ఈ పద్యం చదవగానే దాశరథీ శతకం చదివిన వారికి “ ముప్పున గాలకింకరులు …….
అనే పద్యం వెంటనే గుర్తుకొస్తుంది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !