శ్రీ కృష్ణ శతకం.!........( 6/6/15)... (శ్రీ నరసింహ కవి.)






శ్రీ కృష్ణ శతకం.!........( 6/6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
వలపుల తేజీనెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!
.
ప్రతిపదార్థం:
కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నువ్వు; వలపు తేజీని అంటే ఆనందాన్ని కలిగించే గుర్రాన్ని; ఎక్కి అంటే అధిరోహించి; ఇలపై అంటే ఈ భూమి మీద; ధర్మమును అంటే వేదాలు చెప్పిన మంచి మార్గాన్ని బోధించే ధర్మాన్ని నిలబెట్టడానికి; హీనులన్ అంటే చెడు స్వభావం కలవారిని; తునుమన్ అంటే చంపటానికి; కలియుగము తుదిన అంటే యుగాలలో నాలుగవది అయిన కలియుగం అంతమయ్యే సమయంలో; వేడుకన్ అంటే వినోదంగా; కలికివిగా + ఉన్న అంటే కలికి అవతారంగా ఉండి; లోకకర్తవు అంటే లోకాలను సృష్టించేవాడివి.
.
భావం:
భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు
.
..(కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.

"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!