మచ్చుతునక.! . (దాశరధి గారి మహాంధ్రోదయంలో నుండి.)




.
మచ్చుతునక.!
.
(దాశరధి గారి మహాంధ్రోదయంలో నుండి.)
.
నా యింటి చిన్నది నడుము సన్నముది క
న్నుల తెల్గు సిగ్గులు మొలకలెత్త
నా వైపు సూచి నన్ వలపించుకొన్నది
పాతకాలంపు సౌభాగ్య గరిమ
క్రొత్తనాటి వెలుంగు కూడగట్టినయట్టు
లుంగరమ్ముల జుత్తు నొత్తికట్టి
తెలుగు సింగారాలు తలబ్రాలుగా జార
పూలు ముడిచి ముద్దరాలు వోలె
నవ్వుల వెలార్చి నా యింటి నడుమ సోర
దీపమును కూర్చి పెట్టిన తెలుగుపిల్ల
కన్నడము కన్నడింపని కవన లక్ష్మి
రసభర విజృంభమాణ పూర్ణ కుచకుంభ
.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!