శ్రీ కృష్ణ శతకం.!........( 5/6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీ కృష్ణ శతకం.!........( 5/6/15)... (శ్రీ నరసింహ కవి.)
..
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!
.
.
.
భావం: భావం. ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి.
.
నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు
.
.( బలరామ-కృష్ణావతారాలు:
ఏకోనవింశే వింశతిమె వృష్ణిషు ప్రాప్య జన్మని |
రామకృష్ణావితిభువః భగవాన్ అహరద్భరమ్ ||

పంతొమ్మిది ఇరవైయవ అవతారాలు ఆయన అన్నతమ్ములుగా వచ్చాడు. శ్రీకృష్ణ బలరాములుగా యాదవుల్లో అవతరించి దుష్టసంహారం చేసి భూముకు ఏర్పడ్డ క్లేషాలని తొలగించాడు. ఇందులో ఒకటి సాక్షాదవతారం, మరొకటి జీవుణ్ణి ప్రధానం చేసుకొని వచ్చిన అవతారం. శ్రీకృష్ణుడిగా వచ్చింది సాక్షాదవతారం. బలరాముడిగా వచ్చినది అనుప్రవేశ అవతారం..)

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!