శ్రీ రాముని అంతరంగం.!


శ్రీ రాముని అంతరంగం.!
ఒకవైపు మణిదీపాలు, మరోవైపు కానుగ నూనెతో వెలిగించిన గాజు దీపాలు తోటలో అక్కడక్కడా కాగడాలు-వాటిని మించి గగనంలో కోటి దీపాల కాంతి ప్రసరిస్తున్న కలువలరేడు - ఎటువంటి బాధనైనా మరిపించే అందాల రాత్రి అది
రాముడొక్కడే అక్కడ కూర్చున్నాడు. అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి.
నిద్రలో ఉలిక్కిపడి లేచిన కోయిల ఒక్కసారి ‘కుహూ’ అని అరచి మళ్లీ కళ్లు మూసుకుంది.
గాలికి తోటలోని పరిమళాలు ముక్కుపుటాలకు చేరుతున్నాయి. హాయిగా ఉన్న వెనె్నల-జాబిల్లి-పూల సుగంధాలు-ఆత్మీయుల అనురాగ భాషణలు ఇవేవీ అతడిని తాకలేకపోతున్నాయి
.లోకంలో నూతనంగా పుత్రుడు జన్మించినపుడు ఏ తండ్రి అయినా పొందే అనుభూతిని
ఇప్పుడు తాను అనుభవిస్తున్నాడు. తనకు కవల పిల్లలా? ఎంత సంతోషం అన్పిస్తున్నది.
వైదేహి గర్భమెంత శుభప్రదమైనది. ఇద్దరు బిడ్డలకు ఒకేసారి జన్మనిచ్చిన
ఆ వుదరాన్ని తాకే అదృష్టం తనకు లేకుండా పోయింది.అతని హృదయంలో ఒక నిస్తబ్దత ఆవరించి ఉన్నది. ఆలోచనలన్నీ గడ్డకట్టి మంచుకుహరంలో పడేసినట్లున్నాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!