బంగారు పాపాయి బహుమతులు పొందాలి.!

బంగారు పాపాయి బహుమతులు పొందాలి.! 

 ఈ లలితగీతాన్ని రచించినవారు మంచాళ జగన్నాధరావు.  

 దీనికి సాలూరు రాజేశ్వరరావు స్వరరచన చేశారు. 

(రాగం: శుద్ధధన్యాసి తాళం: ఖండచాపు). .

 1945 లో రావు బాలసరస్వతీ దేవిగారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా జగన్నాధరావుగారు ఈ పాటా రచించి ఇచ్చారు.  ఆ తర్వత రావు బాలసరస్వతీ దేవి గానంచేయగా గ్రామఫోన్ రికార్దు విడుదల చేశారు. ఆ తరం వారిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాట. . బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మామంచి చదువు || పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి! || మా పాప పలికితే మధువులే కురియాలి! పాపాయి పాడితే పాములే ఆడాలి! ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప? ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి, పాపాయి చదవాలి మామంచి చదువు పాపాయి చదవాలి మామంచి చదువు|| తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి, మా నోములపుడు మాబాగా ఫలియించాలి!||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!