శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(2/ 6 /15.)


 

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(2/ 6 /15.)

.
నిను నిందించిన దక్షుపై దెగవొ! వాణీనాధు శాసింపవో !
చనునా నీ పదపద్మసేవకుల తుచ్ఛంబాడు దుర్మార్గులం
బెను పన్న్నీకును నీదు భక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ , లేకుండిన నూరకుండగలవా? శ్రీ కాళహస్తీశ్వరా !

శంకరా ! ఆనాడు నిన్ను నిందించిన దక్షునిపై దండెత్తావు. నిను అవమానించిన బ్రహ్మదేవుని శిక్షించావు .
కాని ఇప్పుడు నీ భక్తులను అతి హీనంగా నిందిస్తున్న దుర్మార్గులను మాత్రం ఏమనకుండా ఊరుకోవడమే కాకుండా వారి అభివృద్ధికి కూడ సహకరిస్తున్నావు.
అంటే నీకు , నీ భక్తులకు మధ్య తేడాను చూస్తున్నావా ఏమిటి !
లేకపోతే నీ భక్తులను దూషించిన వారిని శిక్షించకుండా ఉండగలవా స్వామీ?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !