శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(5/ 6 /15.)

.
శ్రీవిద్యుత్కలితాజవంజన మహా జీమూత పాపాంబుధా
రా వేగంబున మన్మనోజ్ఞసముదీర్ణత్వంబు కోల్పోయితిన్
దేవా మీ కరుణా శరత్సమయమింతే చాలు , చిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తి పట్టణ మందు వెలసిన ఈశ్వరా
మెరుపు తీగవలే చంచలమై చావు పుట్టుకలతో కూడిన సంసారమనెడి కారు
మేఘముచే ధారాపాతముగా కురిసెడి పాపములనెడి వర్షధారల వలన
నామనస్సనెడి పద్మము వికాసమును కోల్పోయినది.
ఓ పరమేశ్వరా ! మీ కరుణ యనెడి శరత్సమయాన్ని
నాపై కొంచెం గా ప్రసరింపచేయ వేడుకొనుచున్నాను.
నీవు కరుణ చూపిన యెడల నామనస్సు ను తిరిగి పదిలపరచుకొని
నీ సేవకు పునరంకితమౌతాను దేవా !

Comments
Post a Comment