శుభోదయం. చీకటి తెరలు తోలుగుతున్నాయి.!


శుభోదయం.
చీకటి తెరలు తోలుగుతున్నాయి
గోకులం మేలుకును సమయమవుతుంది
నలుగురు చూడకముందే మా వస్త్రాలు మాకిచ్చి మా మానం
కాపాడమని ఆర్ధింపు.
కుదరదంటే కుదరదు
మీరంతా బయటకు వచ్చి నా ముందర నిలబడవాల్సిందే
మీరు ఎవ్వరి గూర్చి వ్రతం ఆచరిస్తున్నరు
అట్టివాడు మిమ్ము బయటకు రమ్మని కోరుతున్నపుడు మీ తిరస్కారమేల

కృష్ణుని అదలిమ్పు.
బయటకు వెళదామని కొందరి తెగింపు����..అమ్మో వలదు వలదని
కొందరి బిడియమ్
చల్లని నీటి లో చిగూరూటాకులవలే ఓనుకుచున్న శరీరాలతో
సుకుమారులైన ఆ గోపికలు ఇక తప్పదని కొంచెం ధైర్యం గల వనితలను ముందు
చేసుకుని ఒక్కోక్కరు బయటకు వచ్చి గుంపుగా నిలబడ్డారు
చక్కని రూప లావణ్యాలతో ఒప్పారు ఆ తరునీమణులు, తామర తూడులవన్టి
చేతులతో తనువును దాచుకుంటూ సిగ్గుతో తలలు వంచుకు నిలబడ్డారు.
వారిని చూసి కృష్ణుడు హెచ్చరిస్తున్నడిలా
అలా కాదు అందరు వరుసగా నిలబడన్డి
చేతులు పైకెత్తి నిలబడన్డి
మీ మనస్సు లోని కోరికలను గ్రహించాను. మీతో కలసి రాబోవు
సాయం సమయాలలో మీకు ఆనందాన్ని కలిగిస్తాను
కాత్యాయని దేవిని పూజిస్తూ ఆమె వద్దనుండి ప్రతిఫలమాశించిన మీరు
ఇలా యమునలో నగ్నం గా స్నానమాచరించటం తప్పు కాదా
ఇది దేవిని అవమానించటమే కదా. మీ పాప పరిహారార్ధమే ఇలా చేస్తున్నాను
అని అనునయ వాక్యాలు పలికిన ఆ చిన్ని కృష్ణుని ముద్దు మాటలకు కరిగిపోయి
అందరు తమ చేతులు పైకెత్తి వరుసగా నిలుచున్నారు.
తాము చేసిన తప్పు గ్రహించిన గోపికలు కృష్ణుని ఆజ్ఞ అంగీకరించారు
కోన్టివీ మా హృదయంబులు
గొంటివి మానంబు లజ్జ~గొన్టివి; వలువల్
గొంటి, వి~క నెట్లు సేసెదో
కొంటెవు గదా! నిన్ను నెఱిన్గి కోంటిమి కృష్ణా (పోతన)
ఆ యశోదా నందనుడు ఒక్కోక్కరి వద్దకు వెళ్ళి వారి వస్త్రాలు తిరిగి ఇచ్చేశాడు
ఎంతటి గొప్ప సన్నివేశం ఇది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!