శ్రీ కృష్ణ శతకం.!........( 10/6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీ కృష్ణ శతకం.!........( 10/6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు దండము కృష్ణా!
.
ప్రతిపదార్థం:
విశ్వంభర అంటే సమస్త విశ్వాన్ని భరించినవాడా; దండము అంటే నీకు నమస్కారం; పుండరీకదళ అంటే తామరరేకుల వంటి; నేత్ర అంటే కన్నులు కలవాడా;
హరీ అంటే ఓ విష్ణుమూర్తీ; దండము అంటే నీకు నమస్కారం;
కరుణా అంటే జాలి దయలకు; నిధి అంటే గనియైనవాడా;
ఎపుడు అంటే నిరంతరం; దండము అంటే వందనం;
కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీకున్ అంటే నీకు, దండము అంటే నమస్కారము.

భావం:
సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి.
జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!