శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(14 / 6 /15.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(14 / 6 /15.)
.
నీతో యుద్ధము చేయనోప , గవితానిర్మాణ శక్తిన్నిన్నుం
బ్రీతుం చేయగలేను , నీకొరకు తండ్రిన్ చంపగాజాల నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతుం చీకాకు నా భక్తి యే
రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
.
.
శ్రీ కాళహస్తీశ్వరా ! అర్జునునిన వలే నేను నీతో యుద్దం చేయలేను . నత్కీరుని వలే నీపై కవిత్వం చెప్పి నిన్ను మెప్పించలేను. కాటకోటుని వలే నీ కోసం తండ్రిని చంపలేను. బాలలింగన్న వలే నిన్ను రోకటి తో కొట్టలేను. నీ యెడల నాకున్న భక్తియే నన్ను బాధల పాలు చేస్తోంది. మరి ఏ విధంగా నిన్ను చూడగలను స్వామీ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!