శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(10 / 6 /15.) .

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(10 / 6 /15.)
.
నీ నా సందొడబాటు మాట వినుమా నీచేత జీతంబు నే
గానిం బట్టక , సంతతంబు మది వేడ్కన్గొల్తు , నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు , తే
జీనొల్లం గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా !

శ్రీ కాళహస్తీశ్వరా !
మనిద్దరి మథ్య ఒక ఒప్పందము చేసుకుందాము . విను.
నేను నీ నుండి దమ్మిడీ కూడ జీతం తీసుకోకుండా నేను నిన్ను సేవిస్తాను. అందుకు ప్రతిఫలంగా నీవు నన్ను ఆలుబిడ్డలు , రాగద్వేషములనే అంతశ్సత్రువులకు అప్పగించకుండా నన్ను కాపాడు.
ఇంతమాత్రం చాలు . గుఱ్ఱాలు , ఏనుగుల , సిరి సంపదలు నాకు వద్దు.
నీ భక్తి యే చాలు స్వామీ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!