శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(12 / 6 /15.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(12 / 6 /15.)
.
స్వామి ద్రోహము చేసి ,వేరొకని కొల్వన్ బోతినే? కాక నే
నీమాటల్విన నొల్లకుండితినో ? నిన్నే దిక్కుగా జూడనో ?
యేమీ యిట్టి వృధాపరాధి నగు నన్నీ దు;ఖ వారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తీశ్వరా!
నా ప్రభువు వైన నిన్ను కాదని నేను వేరే దైవాలను పూజించానా ? లేదు కదా !
పోనీ నేను నీ మాటలను ఎప్పుడైన వినలేదా? లేదు కదా !
నీవే నాకు దిక్కని ప్రార్ధిస్తూనే ఉన్నాను కదా !
మరి అటువంటప్పుడు ఏ నేరమూ చేయని నన్ను ఈ దు:ఖసముద్రం
మధ్య లో ముంచి వేయడం న్యాయమా ప్రభూ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!