శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(1/ 6 /15.)





         శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(1/ 6 /15.)

            .

దొప్పం డెంగిలి దెచ్చియిచ్చినను గండూషాంబు ధారావళిన్

దొప్పం దోగిన చెప్పుగాల తలపై ద్రొక్కంగ నట్లైన గ

న్నప్పం బాత్రుని జేసితింతటికి సన్మానంబు దీపింపగా

చెప్పన్నేరము నీ విహార మహిమల్ శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! ఆకుదొన్నెలో ఎంగిలి మాంసాన్ని , పుక్కిలితో నీటిని తీసుకొచ్చి , చెప్పుకాలితో తలపై తొక్కిపట్టిన కన్నప్ప ను ఆదరించి , నీ దయకు పాత్రునిగా చేసుకున్నావు. నీ మహిమలు చెప్పనలవి కానివి కదయ్యా శివయ్యా !

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!