శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(2/ 6 /15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(2/ 6 /15.)

.

కరిదైత్యు న్బొరిగొన్న శూలము కరగ్రస్తంబు గాదో ,రతీ

శ్వరునిన్ గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో

పర నిందాపరుల న్వధింప విదియున్ భావ్యంబె వారేమి చే

సిరి నీకున్బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా !

.


ఈశ్వరా !

 నీవు గజాసురుని చంపిన శూలము ఇప్పుడు చేతినుండి జారిపోయిందా !

మన్మధుని మసి చేసిన నుదుటి నేత్రములోని అగ్ని చల్లారిపోయిందా ! 

లేకపోతే నీభక్తులను నిందించే వారిని శిక్షించకుండా వదిలేస్తున్నావు.

ఇది న్యాయమా. కాకపోతే వారు నీకేమైనా గొప్ప ఉపకారాన్ని చేసి పెట్టారా ఏమిటి ?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!