కలువ కన్నుల కన్నయ్య!
కలువ కన్నుల కన్నయ్య! . "లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్." . ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే ఈ బ్రహ్మదేవుడు! . ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! . (పోతనామాత్యుడు.)...