Posts

Showing posts from June, 2013

హారతి ఎందుకు ఇస్తారు??

Image
హారతి ఎందుకు ఇస్తారు?? ---------------------------------- ఇది common గా మనం అందరం చేసేదే. ఇంట్లో, దేవాలయలో, శుభకార్యాలయాలో హారతి ఇస్తుంటారు. మన పెద్దలు దిష్టి తీసేందుకు కూడా హారతి ఉపయోగిస్తుంటారు. ఈ హారతి ఇవ్వడం లో కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగుందందోయి. దేవాలయలో, శుభకార్యాలలో అనేకమంది గుమికూడటం వల్ల ఆ ప్రాంతం అంతా రద్దీ గా ఉంటుంది. దాని వల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది. అనేక క్రిములు చుట్టూ చేరుతాయి. ఇలాంటప్పుడు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వార దాని పొగాకు సుక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస కొస వ్యాదులు, అంటూ వ్యాదులు రాకుండా ఉంటాయి. అందుకే దిష్టి కుడా హారతి ఉపయోగిస్తారు. ఇదండీ హారతి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని దేవుని ముందు వేడుకుంటూ హరితిని కళ్ళకు అడ్డుకోవడమే ఆధ్యాత్మిక అంతరార్ధం.

శివాష్టకం....

Image
శివాష్టకం.... http://www.youtube.com/watch?v=wl8zvNcXHO0        ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే | గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే | ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ | అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే | వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ గిరీశం గణేశం సురేశం మహేశం, మహేశం శివం శంకరం శంభు మీశానమీడే | గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే | కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్ బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే | శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే | హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహం...

అరటికాయ బజ్జి మినప్పప్పు సొజ్జి

Image
గురుజాడ  అప్పారావు గారి  పద్యాలూ. మిణుగురులు అరటికాయ బజ్జి మినప్పప్పు సొజ్జి కలసి మెలసి తిందాం కధలు విధలు విందాం ఏనుగు ఎక్కి మనము ఏ వూరెళదాము? ఏనుగు ఎక్కి మనము ఏలూరెళదాము! గుఋఋఅం ఎక్కి మనము ఏ వూరెళదాము? గుఋఋఅం ఎక్కి మనము గుంటూరెళదాము! మోటారెక్కి మనము ఏ వూరెళదాము? మోటారెక్కి మనము మోటూరెళదాము! వెన్నుని ఎక్కి మనము ఏ వూరెళదాము? వెన్నుని ఎక్కి మనము వెయ్యూళ్ చూద్దాము!    (భరతి 1930).

రావు బాల సరస్వతి -రాజేశ్వరావు గారి ప్రైవేటు సాంగ్స్,వింజమూరి వెంకట అప్పారావు సమర్పణ..

Image
రావు బాల సరస్వతి -రాజేశ్వరావు గారి  ప్రైవేటు  సాంగ్స్, తుమ్మెద ఒకసారి.... ఆతోట లో నొకటి  కలగంటి కలగంటి   ఓహో  యాత్రికూడా....  ఓహో విభావరి. చల్ల గాలిలో.

నేను చేసి పోస్ట్ చేసిన వీడియో లు.- 1

Image
నేను  చేసి పోస్ట్ చేసిన  వీడియో  లు.

విప్రా కార్తూన్సు...తెలుగు.

Image
. విప్రా కార్తూన్సు...తెలుగు. విప్రా కార్తూన్సు...తెలుగు.

ఆ తోటలో నొకటి ఆరాధన లయం ..

Image
ఆ తోటలో నొకటి ఆరాధన లయం .... రావు బాల సరస్వతి గారు.

రావు బాల సరస్వతి గారి బంగారు పాపాయి..

Image
రావు బాల సరస్వతి గారి బంగారు పాపాయి.. బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి -తెలివిగల పాపాయి కళలన్ని చూపించి ఘన కీర్తి తేవాలి ఘన కీర్తి తేవాలి ఘన కీర్తి తెవాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప ఎవ్వరీ పాపాయి అన్ని ఎల్లరడగాలి తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటి వెలియించాలి మా నోములపుడు మా బాగ ఫలియించాలి

కేదార్ నాథ్ ఆలయ ప్రాస్తిత్యం.. చెక్కు చెదరని కేదార్ నాథ్ ఆలయం..

Image
Venu Gopal Nellutla :: కేదార్ నాథ్ ఆలయ ప్రాస్తిత్యం.. చెక్కు చెదరని కేదార్ నాథ్ ఆలయం.. ఉత్తరాఖండ్ వరదల వల్ల కేదార్ నాథ్ లో తీవ్రమైన ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది. వంతెనలు, పెద్ద పెద్ద కట్టడాలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న సమాచారం ప్రకారం..దాదాపు 15 అడుగులు ఎత్తు వరద నీరు, బురద, బండ రాళ్ళు కొట్టుకొచ్చి సమస్తాన్ని ఊడ్సేశాయి. ఆలయ పరిసరాల్లోని భవనాలు అనేకం నేల మట్టం అయ్యాయి. కానీ కేదార్ నాథ్ ఆలయగోడలు మాత్రం కాస్తంతయినా కదల్లేదు. ఈ నేపథ్యంలో ఆ ఆలయన్ని ఇంత పటిష్టంగా ఎవరు, ఎప్పుడు నిర్మించారనేది ఆసక్తిని కలిగించేది. ఉత్తరాఖండ్ ప్రభుత్న వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 1200 యేళ్ళ క్రితం ఆది శంకరాచార్యుల వారు పాండవులు కట్టించినట్లు నమ్ముతున్న కేదార్ నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం అసలు ఆలయాన్ని కట్టించింది పంచ పండవులు. దీని ప్రకారం చూస్తే ..కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం సాధించినప్పటికీ పాండవులకు మనశ్శాంతి లేకుండా పోయింది. యూద్దంలో సోదరులను, బంధువులను, మిత్రులను, అసంఖ్యాంగన వధించి పాపాలను మూట గట్టుకున్నామని బాధపడుతుంటారు. అందు...

శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ???

Image
శిశుపాలుడు చేసిన 100 తప్పులు ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ??? శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడిమీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు. శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు. అప్పుడు శిశుపాలుని తల్లి, కృష్ణుని మేనత్త అడ్డుపడి, "ఆగు కృష్ణా.. నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు..'' అంది. కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ''అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను.. నీమీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు'' అన్నాడు. అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు. ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పూవులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వె...

భజ గోవిందం భజ గోవిందం,

Image
౧. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రింకరణే ౨. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం ౩. నారీ స్తనభర నాభీదేశం దృష్త్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాదివికారం మనసి విచింతయా వారం వారం ౪. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం సమస్తం ౫. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే ౬. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ౭. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ౮. బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః వృద్ధ స్తావత్ చిన్తాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః ౯. కా తే కాన్తా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చిన్తయ తదిహ భ్రాతః ౧౦. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్...

మోడి.

Image
మోడి మోడి అనునది ఒక జానపద కళా రూపం. మోడి అనగా మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం. ఫలాన రోజున ఫలాన పల్లెలొ మోడి ఎత్తుతారు అని ముందుగానే సమాచారం ఇచ్చి వుంటారు. ఇద్దరు మంత్ర గాళ్ళ మధ్యన పోటి ఈ మోడీ. మంత్రాలతో ఎత్తులకు పైయెత్తులు వేసి ఒకరి నొకరు అడ్డు కుంటుంటారు. చివరకు ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ గారడి విద్య యాబై ఏళ్ళ క్రితమే మరుగైనది. ఇప్పుడెక్కడా మచ్చుకైనా జరగడము లేదు. నేటి తరం వారికి మోడి అంటే ఏమాత్రం తెలియని పరిస్థితి. పూర్వ కాలంలో యదార్థంగా జరిగిన ఒక మోడి కళా విన్యాసం: ఒకసారి మారేపల్లి సిద్దయ్య అనే ఒక పెద్దమనిషి వుండేవాడు. అతడేమి పెద్ద మాత్రికుడు కాదు కాని అతని ఆహార్యం మాత్రం మంత్రగాడిలాగే వుంటాడు. పెద్ద గడ్డం, మెడలో రుద్రాక్షలు, మొహాన వీభూతి రేఖలపై పెద్ద కుంకుం బొట్టు. అతను ఒక సాధారణ సాదుజీవనం గడుపుతూ భార్యా పిల్లలతో ఆ వూర్లోనే కాపురం వుండేవాడు. ప్రతిరోజు రాత్రులందు భజనలు చేసుకుంటూ వుండేవాడు. అతని తోడుకు కొంత మంది సాదువులు వచ్చి పాటలు పాడుతుండే వారు. వారు ఎక్కువగా బ్రంహంగారి తత్వాలు పాడు తుండే వారు. పిల్లల సంతోషార్థం చిన్న చిన్న ట్రిక్కులు, మంత్రాలు చేస్తుండే వాడు. బయటి వూరినుండి ఒ...

ఉపనయనము.

Image
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు. క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు. ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రత...

పుష్పకవిమానము.

Image
తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై అయోధ్యకు బయలుదేఱెను. [1-1-86]

ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"

Image
"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు" “......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ  ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రం లోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు...... “.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి....... “..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు..... “.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీ తో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనక...

లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు! ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే!

Image
మనలో చాలామంది ధనం అంటే లక్ష్మీదేవి అని అనుకుంటారు! లక్ష్మిని పూజిస్తారు! ఇది కొంతవరకు నిజమే కానీ! లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు! ఆయుష్షు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇవి లక్ష్మి అంటే! అసలు ధనం కావాలంటే పట్టుకోవలసింది 'శివుడు'ని! మోక్షం కావాలంటే విష్ణువుని పట్టుకోవాలి!

నెయ్యిలేని కూడు.......విశ్వధాభిరామ వినురవేమ

Image
నెయ్యిలేని కూడు నెయ్యిలేని కూడు నీఆన కసవది కూరలేని తిండి కుక్క తిండి ప్రియము లేని కూడు పిండంపు కూడురా భావము: నెయ్యి లేని భొజనము గడ్డితో సమానము.కూరలేని తిండి కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం అంటున్నాడు ఈ పద్యములో వేమన. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వధాభిరామ వినురవేమ భావము: పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసిన ఈ పద్యము, వేమన శతకానికే మకుటాయమానము.సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరికీ ఇబ్బందులు సమానము.చెప్పులో రాయి దూరినా,చెవిలో జోరీగ రొద పెట్టినా, కంటిలో నలుసు పడినా ,కాలిలో ముల్లు గుచ్చుకున్నాకలిగే బాధ అనుభవైహికవేద్యమే తప్ప అనిర్వచనీయము.వీటన్నిటికీ మించి ఇంటిలోని ఇల్లాలు సాధింపు,సతాయింపు ఇంకా ధుర్భరము.వక్రీకరణము లేని ఇన్ని వాస్తవాలు చెప్...

పంచభూతలింగాల గురించి మీకు తెలుసా?

Image
పంచభూతలింగాల గురించి మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. 1. పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. 2. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. 3. జలలింగం:- ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసిన...

దేవుడుకేమి ,,పర్వాలేదు... ఈ మానవుడే బాధలు పడుతున్నాడు.

Image
దేవుడుకేమి ,,పర్వాలేదు... ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. The Kedarnath temple, one of the four holy dhams, including Badrinath, Gangotri and Yamunotri, is located at a height of about 3550 metres above sea level. An idol of Nandi situated at the temple's entrance is intact, but surrounded by slush. Officials said 123 bodies were recovered from the Kedarnath temple complex, raising the official death toll to 680 The 8th century samadhi of Adiguru Shankaracharya, which was located in the vicinity of the Kedarnath temple, was washed away by the flood waters. Two statues of Shankaracharya, a Hanuman statue and a ling were swept away, they said.

ఏది కోరేది వాడినేది అడిగేది

Image
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది By A. Saye Sekhar

భర్తృహరి సుభాషితాలు

భర్తృహరి సుభాషితాలు      భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్      భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్      భూషలు కావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వా      గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్ !! పై పద్యానికి సంస్కృత మూలం      కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః      న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా      వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే      క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం !!      ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై      త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ త      చ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా      బొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్ !!          అతనికి వార్ధి కుల్య యగు నగ్ని జలంబగు మేరు శైలమం      చిత శిల లీల నుండు మద సి...

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

Image
వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే.. ఈశ్వరుడు అంటాడుట "నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు. ఇది వరకు తిరుమలలో "తొండమాన్ చక్రవర్తి" అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట - స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పు...

శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారీ .... చెళుకులు

శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారీ .... చెళుకులు ఈ క్రింద కనపడే 'చౌకరాజ్యం'....ఇది వ్రాసింది భట్టు...వుంటుంది విట్టు... నిజం ఒట్టు. వీట్టు అంటే ఇల్లు....అరవం...తెలుసుకదా అరవం.....అంటే...భాష...మళ్ళీ తెలుసుకదా. టట్టటాం.....చౌక రాజ్యం....భట్టు స్కిట్టు. (దేశకాలపరిస్థితులను దృష్టిలో వుంచుకొని విజ్యులైజ్ చేయండి.) దండోరా::: రండిసార్ రండి కొనండి. మంచి దుస్తులు సార్ ! మంచి మంచి వస్త్రాలు సార్ ! మీటరు క్లాతు రెండు పైసలు. ఓన్లీ టు పైసే. ఫారిన్ నైలక్స్ చీర అర్థరూపాయి. పిల్లల డ్రాయర్లు వంద మూడు పైసలు. పది జేబురుమాళ్ళూ ఒక్క పావలా సార్ ! ట్వినుఫూల్సు వెడ్డింగు సూటింగ్ మీటరు పదిపైసలు సార్ ! ఓన్లీ పదిపైసలు సార్ ! బెనారస్ పట్టుచీర ఒకేఒక్క రూపాయి.....ఇంకా ఆరణి పావలా...ధర్మవరమ్ దస్ పైసా......అమ్మా ! రండి ... అయ్యా ! రండి. కారు చౌక ... కారు చౌక........ (కారు స్పీడు తగ్గి ఆగుతుంది) శంకరం: ఒరేయ్ అచ్యుతం..ఆరు రూపాయలు తగలేసి ఈ పెయ్యమూతి చిన్నకారు కొనేకంటే పదిరూపాయలు తగలేసి పందిమూతి కారు కొంటే బాగుంటుందికదరా.? అచ్యుతం:: ఇంకా ధరలు తగ్గుతాయిరా....ఆ పెద్దకారు మూడురూపాయలకే వస్తుందట....

సోమనాథ లింగ విశిష్టత.

Image
శివ మహాపురాణం సోమనాథ లింగ విశిష్టతని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, వారే 27 నక్షత్రాలు. ఆయన కుమార్తెలనందరిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేసారు. కానీ చంద్రుడు మాత్రం ఎక్కువగా రోహిణితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఈ విషయం మిగిలిన కుమార్తెలకి నచ్చక తండ్రి గారికి ఫిర్యాదు చేసారు. తండ్రి గారు వెళ్లి, అల్లుడితో మాట్లాడారు, అల్లుడుగారు సరే మామగారు అందరితో కాపురం చేస్తాను అని అన్నాడు. కానీ అల్లుడి గారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దక్షుడుకి కోపం వచ్చి చంద్రుణ్ణి నువ్వు క్షయ వ్యాధితో బాధపడుగాక అని శపించాడు. దీని వల్ల దేవతలకు ఆహారం లేదు. ఎందుకని? చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఓషధులు బాగా ప్రకాశిస్తాయి. ఆ ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేస్తే,వాటిని హవిస్సుగా దేవతలు స్వీకరిస్తారు. ఈ సమస్యకి పరిష్కారం కోసమని, పెద్దాయన దగ్గరకు వెళ్ళారు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ గారు. ఆయన చంద్రుణ్ణి పరమ శివుడి కోసం తపస్సు చెయ్యమన్నారు. చంద్రుడు అలాగే అని అన్నాడు. చంద్రుడి తపస్సు పరిపక్వత చెందాక, పరమ శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమ శివుడికి తెలియదా, చంద్రుడు ఎందుకు తపస్సు చేసాడో? పెట్టినా తండ...

దుర్భరబాణము------కృష్ణ శతకము.

Image
దుర్భరబాణము రాఁగా గర్భములో నుండి యభయ గావుమటన్నన్ నిర్భరకృప రక్షించితివి నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!----- (కృష్ణ శతకము) కృష్ణా!అశ్వత్థామ యపాండవము అగునట్లు బ్రహ్మాస్త్రమును విడువగా అదియు తల్లియైన ఉత్తర గర్భములో నున్న పరీక్షిత్తునకు తగిలెను." అభయమిచ్చి ఆ శిశువును రక్షించుము. " అని వేడుకొనగా నీ వతనిని ఆ అస్త్రము నుండి కాపాడితివి.

Sardar Jokes

it read: AM A VERY FATHERLY PERSON, I HAVE LOTS OF FATHERS, SOME OF MY FATHERS ARE MALE AND SOME ARE FEMALE. MY TRUE FATHER IS MY NEIGHBOUR. *********************************************** Interviewar: what s ur qualification? Sardarji : Sir I am Ph.d. Interviewar : what do u mean by Ph.d? Sardarji : (smiling) PASSED HIGHSCHOOL with DIFFICULTY.... *********************************************** Amitab : In which state Cauvery flows? Sardar : liquid state..... Audience clapped.. Amitab stunned, looks behind, ALL WERE SARDARS....... *********************************************** 2 sardars were fixing a bomb in a car. Sardar 1 : What would you do if the bomb explodes while fixing. sardar 2 : Dont worry, I have one more. *********************************************** Sardar : What is the name of your car ? Lady : I forgot the name, but is starts with "T". Sardar : Oye Kamaal ki gaadi hai, Tea se start hoti hai. Hamaara gaadi petrol se start hoti hai. ********************...