కఠోపనిషత్ - 8 (జూన్ 11)

కఠోపనిషత్ - 8 (జూన్ 11)
యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు?
మొదట యమలోకంగురించి తెలుసుకుందాం. యమలోకం భయంకరమైన లోకంకాదు. స్వర్గంవలే మహాతేజోవంతమైన ఊర్ధ్వలోకం. యముడు సూర్యపుత్రుడు, దక్షిణ దిక్పాలకుడు. కొంతకాలం భూలోకంలో ఒక మనుష్యదేహం ధరించి కొన్ని కర్మలుచేసి, మృత్యువాతపడి, దేహాన్ని విడిచిన జీవుడు దేహాత్మ భావనను వీడక, ప్రేతరూపంలో, మరణించిన ఒక సంవత్సరానికి, యమలోకానికి వస్తాడు. అంతవరకు ఆజీవి పరేత (ప్రేత). మృత్యువు, దహనము వంటి కార్యక్రమముతో వచ్చిన తృష్ణ, తాపము, పిపాసతో బాధపొందుతున్న ఆతని జీవుని, ఈ యానంలో ఆత్మ శాంతికి కుమారులు చేసిన తిలోదకాలు, ఇతర కర్మకాండ, దానాలు తోడ్పడుతాయి. యముడు సమవర్తి, పరేతరాట్, అంటే ప్రేతలకు రాజు. ఆ జీవుని పుణ్య పాప కర్మలకు అనుగుణంగా యేయే ఫలాలు ఇవ్వాలో అవి ఇచ్చేవాడు యముడు. ఆజీవుడు భోగ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలో, యాతనాశరీరంతో నరకానికి వెళ్ళాలో, ప్రేతరూపంలోనే భూలోక పరిధిలోనే కొంతకాలం ఉండి పునర్జన్మ పొందాలో, ఎలాంటి జన్మ పొందాలో నిశ్చయించేవాడు ధర్మదేవతయైన యముడు. నరకం పాపులు శిక్షలుపొందే లొకం.
నచికేతుడు మరణించలేదు. అతడి ఆయుర్దాయము పూర్తికాలేదు. అతడు తండ్రి వాక్కులోనున్న బలముతో తక్షణమే యమలోకంలో ఉన్నాడు. వైశ్వానరుని వలే (అగ్నివలె) ప్రవేశింఛాడని ఉపనిషత్తుచెబుతూంది. అంటే మరణించకుండా శరీరము వదలి తేజోరూపాన్ని స్వీకరించి వెళ్ళాడన్నమాట. ఇది యోగమార్గము. ఉదాహరణకు దీనిని పరకాయ ప్రవేశ విద్యతో పోల్చవచ్చు. పరకాయ ప్రవేశంలో జీవుడు తనస్వదేహాన్ని వదలి మరో (మృత) శరీరంలోనికి వెడతాడు. ఇక్కడ సూక్ష్మదేహంతో, తాను నచికేతుడననే భావంతోనే వెడతాడు. నచికేతుని శరీరం తండ్రి ఆశ్రమంలోనే మరణించకుండా నిలిచి ఉన్నది. సగం ప్రాణం జీవునిలోను, సగం వదలిన శరీరంలోనూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైనది?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!