తెనాలి రామలింగ కవి .
తెనాలి రామలింగ కవి మనకు 'వికట కవి' గానే తెలుసు. కాని, ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం చదవండి...యెంత హృద్యంగా ఉందో...
తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు
కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు
ఉరగ వల్లభ హార మయూరమునకు
చెన్ను వీడిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ
శివపార్వతులిద్దరు హిమగిరి సానువులలో విహరిస్తున్నారు. ఆ విహార సమయంలో, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి, పార్వతీ దేవి, పరమేశ్వరుడి పక్కన ఎలా (ఒప్పి) ఉన్నదంటే -పున్నమి చంద్రుని వంటి శేఖరమనే హంసకు మంచి నీటితో కూడిన లోతైన సరస్సు లాగా, కోకిల కూజితం లాంటి కంఠస్వరం ఉన్న భర్తకు, లేమావి కొమ్మ లాగా, సురలోకవాహిని - అంటే గంగ - గంగాధరమనే భ్రమరానికి, ప్రాతః కాలంలో పూచిన తామర లా (పొద్దున పూచిన పూలలో తేనె మెండుగా ఉంటుంది కదా), రాజరాజు (చంద్రుడికి రాజు) అనబడే రామచిలుకకు తనై తను ఒప్పుకుని చేరుకున్న పంజరంలా (మానిత పంజర స్థానము), ఉరగాన్నే హారంగా ధరించిన ఈశ్వరుడనే నెమలికి ఎత్తైన పర్వత సానువు లాగా (నెమళ్ళు పర్వత సానువులనే ఎక్కువ ఆశ్రయిస్తాయి కాబోలు).....ఇలా ఉందట.
మామూలుగా శివుడి రంగు తెలుపట, కాబట్టే తరుణ శశాంక శేఖర మరాళమయ్యాడు. ఆ తెలుపు రంగు శివయ్యకు కంఠం మాత్రం నలుపు. విషం మింగాడుగా. మరందుకే కైలాస గిరినాథ కలకంఠ భర్త అయ్యాడాయన. ఇక అమ్మవారో - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి. భర్త కు తగిన ఇల్లాలు. అందుకే కాబోలు చిఱ్ఱు బుఱ్ఱులాడే ప్రియురాలిలాగా కాకుండా - అంటే - కలహంసకు కాసారంలా, కోకిలకు లేమావికొమ్మలా, తేనెటీగకు కంజాతంలా, రామచిలుకకు ఇష్టపడి బంధించుకున్న పంజరంలా ...ఇలా అందంగా, అనుకూలంగా ఉన్నది భర్త పక్కన.

Comments
Post a Comment