కృష్ణశాస్త్రి సాహితి
కృష్ణశాస్త్రి సాహితి
“నా నోట నీ మాట గానమయ్యే వేళ
నా గుండె నీ వుండి మ్రోగింపవా వీణ?
రాగ మెరుగని వీణ,రక్తి నెరుగని వీణ
తీగపై నీ చేయి తీయకే గడెయేని !”
– గీతం 58
శ్రీ కృష్ణశాస్త్రి వ్యక్తిత్వం ‘అంత రాంతరాల ‘ లో నిండి ఆయన ప్రతి మాటనీ కీర్తనగా, మనికిని నర్తనగా తీర్చిన ‘అమృత వీణ ‘ ఇది.భౌతికంగా గొంతు మూగపోయిన తరువాత కూడా జీవితాంతం పలుకుతూ వచ్చిన వీణ ! ఎంత వైయుక్తికమో అంత విశ్వజనీనం ఈ వీణ !
ఏడు తంత్రులు ఈ ‘అమృత వీణ ‘ కి:కృష్ణ రజని ,కన్నీరు,ౠతు ఖేల,విరి తూపు మొదలైనవి. నిరాశ,కరుణ,ఆర్తి,భక్తి,ప్రణయం,ప్రకృతి ఆరాధన,గోపికా కృస్ణుల పుణ్యప్రేమ వంటి సప్త స్వర శింజితం ఈ ‘అమృత వీణ ‘.
కృష్ణశాస్త్రి సాహితిలో గేయ సం హిత రెండు సంపుటాలు. మొదటిది ‘అమృత వీణ ‘.రెండవది ‘మంగళ కాహళి ‘ దేశభక్తి గీతాలతోనూ తెలుగుజాతి జీవన సన్నివేశ కీర్తనలతోనూ కూర్చింది.
‘అమృత వీణ ‘ లో కన్నీరు, మహతి అనే శీర్షికల కింది పాటలు తప్పిస్తే తక్కిన వన్నీ మొదటిసారిగా గేయసంపుటంగా వెలువడ్డాయి. వెనుక అచ్చయినా, ‘కన్నీరు ‘ గాని, ‘మహతి ‘ సంపుటం గాని ఇప్పుడు అలభ్యాలు. అదీ కాకుండా అవి లేకపోతే ‘అమృత వీణ ‘కు నిండుతనం రాదు అనే ఉద్దేశంతో ఆ పాటలు ఈ సంపుటంలో చేర్చాము.
ఈ పాటలలో కొన్ని శ్రవ్య నాటికలనుంచి గ్రహించినవి. చాలాభాగం గాయనీ గాయనుల ద్వారా లభించినవి.
శ్రీ కృష్ణశాస్త్రి పాటలలో ఒక విశేషం – శ్రవ్యనాటికకి వ్రాసినా, మరో ప్రత్యేక సన్నివేశం కోసం వ్రాసినా సన్నివేశనిరపేక్షంగా స్వతంత్ర భావ గీతాలుగా అవి ఆస్వాదించదగినవిగా ఉండడం.
ఇది గాయకుల కోసం స్వరాలతో ప్రకటిస్తున్న సంపుటం కాదు కనుక కేవలం సాహిత్య దృష్టితోనే, పఠ నానుకూలంగానే ఈ పాటలు అచ్చు వేయబడ్డాయి.కావాలంటే గాయకులు యథానుకూలంగా పల్లవి తిరిగి తిరిగి అనవచ్చు. అవసరమైతే హ్రస్వాలు దీర్ఘాలు చేసుకోవచ్చు.
పాటలను రచనా కాలాన్ని బట్టి కూర్చడంవల్ల కొన్ని లాభాలు ఉన్నా, విషయ సామ్యం ఉన్న గీతాలన్నీ, ఒక చోటకి రావు. అందుచేత విషయ ప్రధానంగానే ఈ పాటల కూర్పు జరిగింది.
’వ్యాసావళి ‘ లాగే గేయ సంహిత కూర్పు కూడా ‘కృష్ణశాస్త్రి సాహితి ‘ అధ్యయనానికి రసజ్ఞులకు తోడ్పడితే సంపాదకుల శ్రమ నిరర్థకం కాదు.

Comments
Post a Comment