దేవుడా ..నీ తోటను చూడు

దేవుడా ..నీ తోటను చూడు
Posted on నవంబర్ 11, 2006 by gsnaveen
దేవుడా!!!
ఈ అనంత శూన్యంలోనుంచి అమేయమైన విశ్వాన్ని సృష్టించావు…విశ్వం బోసిపోయిందని తలచి భూమి అనే వనంలో మనిషనే విత్తనాన్ని నాటావు…ప్రాణమనే నీరును పోసి బుద్ది, ఙ్ఞానం, ప్రేమ, విశ్వాసం అనే ఎరువుల్ని వేసి..పుడమిని అందమైన తోటగా మారుద్దాం అనుకొన్నావు..
కానీ స్వామీ..నీ లెక్క తప్పింది..
అహంకారం, స్వార్థం, కామం, కుళ్ళు, అసహనత, మోహం, క్రోదం, ఆవేశం అనే చీడ పురుగులు పంటనాశించి..మీ తోటను నాశనం చేస్తున్నాయి..మంచితనం, దర్మం అనే పురుగుల మందుకు కూడా లొంగనత వెర్రి తలలు వేస్తున్నాయి..
తండ్రీ నీ పంటను రక్షించుకోమనటం లేదు. ఈ మొక్కలకు చీడలనుంచి కాపాడుకొనే శక్తిని ప్రసాదించు.
నీ మహిమజూపుము దేవా!!
అహంకారంతో కూడిన మనసుకు ఒదిగి ఉండటంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలియజేయి
స్వార్థంతో నిండిన మనసుకు దానంలో ఉన్న ఆనందం ఏమిటో చెప్పు
కామంతో కాలిపోయే తనువుకు ఆత్మీక స్థితి నేర్పు
కుళ్ళుతో ఉడికిపోయే వారికి అభినందించడంలో ఉన్న హుందా చూపు
అసహనతతో కూడీన జీవితం ఎంత వ్యర్థమో తెలుసుకునేలా చేయి
మోహం ఉన్న చోటే భాధలు కాపురం చేస్తాయన్న నిజం తెలియజేయి
క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు
ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!