- తిరుపతి వేంకటకవులు.-2

శతఘంట కవనమ్ము సల్పు సంగతియన్న
కరతలామలకమ్ముగాదె మాకు
అష్టావధాన కష్టావలంబనమన్న 
నంబికొండయ దండనంబు మాకు
ఆశుధారా కవిత్వాడంబరంబన్న
నల్లేరుపై బండి నడక మాకు
సత్కావ్య నిర్మాణ చాకచక్యంబన్న
షడ్రసోపేత భోజనము మాకు

వ్యర్థమగు వాదము లొనర్చునట్టివారి
డంబ మణగించు టాపోశనంబుమాకు
దానరాధేయ! కవిసముదాయగేయ!
పండిత విధేయ! రామభూపాలరాయ!

- తిరుపతి వేంకటకవులు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!